calender_icon.png 21 May, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి

21-05-2025 12:00:00 AM

సిరిసిల్ల మే 20( విజయక్రాంతి )వ్యవసా య శాఖ, ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారిణి తెలంగాణ సీడ్స్ కార్పొరే షను ప్రాంతీయ మేనేజర్ కలిసి, ముందస్తుగా వానకాలంకు కావలసిన విత్తనాల గు రించి సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయా ల సముదాయం ఆఫీస్ లో సమీక్ష నిర్వహించడం జరిగింది. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 97200 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలను జి ల్లాలకు చేరవేస్తున్నట్టు తెలియజేశారు.

అధికారులు ప్రణాళికబద్ధంగా విత్తనాలను రైతు లకు అందించాలని కోరారు.ఈ కార్యక్రమం లో సిరిసిల్ల  జిల్లా వ్యవసాయ అధికారిని అ ఫ్జల్ బేగం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతీయ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి , విత్తన అధికారి మౌనిక, మండల వ్యవసాయ అధికారు లు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ అధికారులు  వ్యవసాయ విస్తరణ అధికారులు మహిళా సంఘాలు ఐకెపి ప్రతినిధులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డీలర్లు డీసీఎంఎస్ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల డీలర్లు పాల్గొన్నారు.