21-05-2025 12:00:00 AM
కరీంనగర్, మే 20 (విజయ క్రాంతి): తె లంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాల యా జమాన్య సంఘాలు విద్యాహక్కు చట్టాన్ని తాము అమలు చేయమని, ప్రైవేట్ పాఠశాలలో విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హత గల 25% విద్యార్థులకు ఉచితంగా విద్యను ఇ వ్వమని ప్రకటించడం సరికాదని ఏఐఎస్‌ఎ ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఒ క ప్రకటనలో తెలిపారు.
వెంటనే నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ చెబుతున్న నిబంధనలను కూడా పట్టించుకోకుండా ప్రవేట్ పాఠశాలలు ఏకపక్ష నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో తప్పనిసరిగా విద్య హ క్కు చట్టం అమలు చేయాలని, ప్రతి పాఠశా ల వారు ఈ విద్యాసంవత్సరం 15 నుండి 30%ఫీజులు పెంచుకున్నారని, ఫీజులు పెం చుకున్నప్పుడు ఉచిత విద్య ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.