21-05-2025 12:00:00 AM
స్కానింగ్ కోసం వస్తే ప్రసవం చేసి ప్రాణం తీశారు
కల్వకుర్తి మే 20 : కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సాయి ప్రైవేటు ఆసుపత్రిలో బాలింత మృతి చెందిన సంఘటన సోమవారం రా త్రి చోటు చేసుకుంది. మృతురాలి భర్త వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం. వెల్దండ మం డల పరిధిలోని కొట్ర గ్రామానికి చెందిన రేణుక (25) గర్భిణి స్కానింగ్ కోసం శ్రీ సా యి హాస్పిటల్ కి వచ్చారు. స్కానింగ్ చేయాల్సిన డాక్టర్లు లోపల బేబీకి బ్లడ్ అందడం లేదని డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో గర్భిణి బంధువులు ఒప్పుకున్నారు.
డెలివరీ అయిన మరుసటి రోజు రేణుకకు తీ వ్ర రక్తస్రావం అవడంతో అత్యవసరంగా బ్ల డ్ కావాలని చెప్పారని, జిల్లా కేంద్రానికి వెళ్లి బ్లడ్ యూనిట్ సరైన సమయానికి తెచ్చినప్పటికీ పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాలని చెప్పడంతో హుటాహుటిన హై దరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాదు ఆసుపత్రిలో అయ్యే చికిత్సకు కల్వకుర్తిలో ప్రసవం చేసిన శ్రీ సా యి హాస్పిటల్ డాక్టర్ కూడా కొంత డబ్బు లు చెల్లించినట్లు తెలిపారు, చికిత్స పొందు తూ రేణుక మృతి చెందింది. మాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగవద్దని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
రేణుక మృతికి హాస్పిటల్ యాజమాన్యమే కారణమని మృతురాలి బంధువులు హాస్పిటల్ ముందు సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి యాజమానిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక అనేకమంది బాలింతలు, శిశువుల మరణాలు సం భవించినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.