calender_icon.png 22 November, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలి

10-02-2025 12:00:00 AM

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు 

జహీరాబాద్, ఫిబ్రవరి 9 : జహీరాబాద్ మార్కెట్ కు వచ్చే రైతులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు , వ్యాపారస్తులు సహకరించాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణములోని నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థను ప్రారంభించారు.

ది గ్రేట్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు శంకరప్ప పాటిల్ వ్యాపారస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మార్కెట్ వచ్చే రైతులకు సకల సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాలని రైతులకు లాభాలు చేకూర్చే విధంగా వ్యాపారస్తులు చొరవ తీసుకోవాలన్నారు.

రైతులు పండించిన పంటకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామా రవి, నీల వెంకటేశం,  కల్వ చంద్రశేఖర్, కొంభాజీ వీరేశలింగం, అనిల్ జాజు, శ్రీనివాస్ వ్యాపారస్తులు రైతులు పాల్గొన్నారు.