calender_icon.png 22 November, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ తన స్థాయి దిగజారుతున్నారు

09-02-2025 10:55:55 PM

ఎమ్మెల్యే పాల్వాయి హరిష్‌బాబు...

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగవని ఎమ్మెల్యే పాల్వాయి హరిష్‌బాబు అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హాయంలో సిర్పూర్ నియోజవర్గ అభివృద్దిపై చర్చకు సిద్దమా అని కేటీఆర్‌కు సవాల్ వేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కాగజ్‌నగర్ బీఆర్‌ఎస్ నాయకుల సమావేశంలో కేటీఆర్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.

అసెంబ్లీలో తన మాట్లాడిన సందర్భాన్ని వక్రీకరించి నియోజవర్గాన్ని మహారాష్ట్రలో కలపాలనే విషయాన్ని హేళనగా చేయడం సరికాదన్నారు. తన నియోజవర్గం మహారాష్ట్రలో కలిస్తేనైనా అభివృద్ధి చెందుతుందనే అవేధన వ్యక్తం చేశానని ఆసమయంలో కేటీఆర్, కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఉండి ఉండవచ్చని తెలిపారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.