25-01-2026 06:14:49 PM
* టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా హడ్ హాక్ కమిటీ కన్వీనర్ దూమర్ల భాస్కర్
అచ్చంపేట: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాగర్ కర్నూలు జిల్లా మహాసభలు ఈనెల 28న అమ్రాబాద్ మండలం మన్ననూరులో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా హడ్ హక్ కమిటీ కన్వీనర్ దూమర్ల భాస్కర్, కో- కన్వీనర్ చారగొండ బాలకృష్ణ తెలిపారు.
మహాసభలకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పి.ఆనందం, రాష్ట్ర నేతలు డా. బండి విజయ్ కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారని తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించి హక్కుల సాధన కోసం చేపట్టవలసిన కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జర్నలిస్టు మిత్రులు అధిక సంఖ్యలో హాజరై ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.