calender_icon.png 22 November, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు...

09-02-2025 11:00:30 PM

ఇద్దరి మృతి...

మలక్‌పేట: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం... న్యూ మలక్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ మొయిన్ ఖాన్(60) ఆదివారం తెల్లవారుజామున చాదర్‌ఘాట్ చమన్ వద్ద రోడ్డుపై నడ్చుకుంటూ వెళ్తుండగా, వెనుక నంచి వేగవంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించిగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆగి ఉన్న లారీని ఢీకొని...

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సయ్యద్ మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సయ్యద్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.