calender_icon.png 24 September, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లిలో వ్యక్తి అదృశ్యం

24-09-2025 12:26:56 AM

మేడిపల్లి, సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి): భార్యా, భర్తల మధ్య గొడవతో భర్త అదృశ్య మైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మొండ్రాయి గ్రామం, కొడకండ్ల మండలం, జనగామ జిల్లాకు చెందిన ధరావత్ రాజేష్ (26), భార్య ధరావత్ శిరీష, బోడుప్పల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో ఉంటున్నారు. వీరికి 2022 జనవరిలో వివాహం అయ్యింది. రాజేష్ సరూర్ నగర్‌లో అమూల్య సిల్క్ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నాడు, శిరీష బోడుప్పల్‌లో షాపిం గ్ మాల్‌లో పనిచేస్తుంది.

పెళ్లి అయ్యి ఎన్ని నెలలైనా సంతానం కలగడం లేదని భార్యా భర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. ఈనెల 20న శిరీష డ్యూ టీకి వెళ్లగా ఆమె భర్త ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. భార్య మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.