calender_icon.png 27 October, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి

27-10-2025 12:29:28 AM

  1. వైద్య శాఖ టాస్క్ ఫోర్స్ నివేదిక బయట పెట్టాలి 

సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు 

సంగారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్య లు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కేకే భవన్ లో జరిగిన స మావేశంలో మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో కనీస సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో వరుస ఘటనలు జరుగుతున్నా జిల్లా అధికారులు స్పందించటం లేదని విమ ర్శించారు. రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారుల నివేదిక బయట పెట్టాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలో 17 ప్రైవేట్ ఆసుపత్రులకు జరిమానా వేసినట్టు తెలుస్తోందన్నారు. 25 మంది నకిలీ వైద్యులను ఐఎంఏ గుర్తిస్తే జిల్లా ఆరోగ్య అధికారులు ఏం చేస్తున్నారని, అలాగే రాష్ట్ర అధికారులు తనిఖీలు చేస్తుంటే జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు,

జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే ప్రక్షాళన చేపట్టాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాణిక్యం, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.