calender_icon.png 1 August, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

30-07-2025 01:02:47 AM

  1. పశు వైద్యశాల, పీఎసీఎస్ సెంటర్‌లో  కలెక్టర్ రాజర్షిషా తనిఖీలు
  2. పలు మండలాల్లో ఆహార భద్రత కార్డుల పంపిణీ

ఆదిలాబాద్, జూలై ౨౯ (విజయక్రాంతి): పశుపోషణ రైతులకు   ఎలాంటి ఇబ్బందు లు లేకుండా సేవలు అందించాలన్నారు. మంగళవారం జైనథ్ మండలంలోని పశు వైద్యశాలను  జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పని తీరును, పశువైద్యుల హాజ రు, ఔషధాల నిల్వలు, రోగ నిర్ధారణ పరికరాల వినియోగం, రికార్డ్ నిర్వహణ అం శాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువైద్య సేవలు సమ ర్దవంతంగా, సమయానికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి, పశువులకు ఎలా వైద్యం చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి,  మండ ల పశు సంపద వివరాలు, మందుల కొరత ఉందని తెలుసుకొని మందుల కొరత లేకుండ వారం రోజుల్లో అందుబాటులో ఉంచుతామని రైతులకు తెలిపారు.     

అదేవిధంగా జైనథ్, భీంపూర్ మండలాల్లో నిర్వహించిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ లతో కలిసి లబ్ధిదారులకు కలెక్టర్ కార్డులను అందజేశారు. అనంతరం భీంపూర్ మండ లంలోని అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంను ఆకస్మికం గా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అంగన్వాడీలో చిన్నారుల హాజరును రిజిస్టర్‌ను పరి శీలించారు. పిఎసిఎస్ సెంటర్లో యూరియా స్టాక్ వివరాలపై అరా తీశారు. యూరియా నిల్వలను పరిశీలించి, రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవం తి, అధికారులు పాల్గొన్నారు.