calender_icon.png 1 August, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

30-07-2025 01:01:41 AM

కలెక్టర్ దివాకర టి.ఎస్. 

ములుగు వెంకటపూర్,జూలై29(విజయక్రాంతి):ఎరువుల దుకాణాదారులు కృత్తిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ హెచ్చరించారు మంగళవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, కొనుగోళ్ల రిజిస్టర్ ను పరిశీలించారు. దుకాణాల్లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్సిడీ ఎరువులను దారి మళ్లించినా,బ్లాక్ మార్కెట్టుకు తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పురుగుమందులు రైతులకు సరిపడ అందుబాటులో ఉంచాలని అన్నారు.  ఎరువులు,విత్తనాల స్టాక్ బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, రైతు సమస్యను ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు నిరంతరం ఫెర్టిలైజర్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల నేల స్వభావం దెబ్బతింటుందని, ఈ విషయాల పట్ల రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తూ తక్కువ పరిమాణంలో ఎరువులు వాడేలా అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు నానో యూరియా వినియోగించాలని సూచించారు.