23-01-2026 12:00:00 AM
గాంధారి, జనవరి 22 (విజయక్రాంతి): రైతులు పంటలను చీడ పురుగుల నుండి సంరక్షించుకోవాలి అని గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగం అన్నారు. ఈ మేరకు గురువారం రోజున గాంధారి మండలం దుర్గం సొసైటీ మరియు ఎరువుల దుకానాలను తనిఖీ చేయడం జరిగింది. యూరియా ఎరువు ను పరిశీలించడం జరిగింది.
అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ తో కలిసి గుజ్జుల్, బంగారువాడి శివారులలో వరి మరియు జొన్న పంటలను పరిశీలించి వరి పంటలో కాండం తొలచు పురుగు నివారణ కు క్లోరంతనిలిప్రోల్ గుళికలు 4 కేజీలు ఒక్క ఎకరానికి మరియు బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు కు ప్రోపికోనోజోల్ 200 గ్రాములు ఒక్క ఎకరానికి వాడాలని,జొన్న పంటలో రసం పీల్చు పురుగులకు థాయో మిథాక్సిన్ 80 గ్రాములు నివారణకు వాడాలని రైతులకు సూచించడం జరిగింది..అయన వెంట రైతులు పాల్గొనడం జరిగింది.