23-01-2026 12:00:00 AM
నాగిరెడ్డిపేట్, జనవరి 21 (విజయక్రాంతి): నర్సరీలోని మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారం గ్రామంలో గల నర్సరీని, అంగన్వాడీ కేంద్రాన్ని హెల్త్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన నర్సరీ, పల్లె ప్రకృతి వనం నిర్వహణ, మొక్కల సంరక్షణ, పరిశుభ్రత, మౌలిక వసతుల ఏర్పాట్లపై గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్ అసిస్టెంట్, హెల్త్ సెంటర్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
గ్రామంలో పచ్చదనం పెంపొందించేలా నిరంతరం సంరక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించలే పనులు చేపట్టాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో పల్లె ప్రకృతి వనాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పని చేయాలని గ్రామ అధికారులకు సూచించారు. గ్రామ సర్పంచ్ ప్రభువు గౌడ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, ఫీల్ అసిస్టెంట్ ఫర్వీణ, హెల్త్ సిబ్బంది ఉన్నారు.