20-11-2025 05:50:05 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సర్వో ఆయిల్, ఇండియన్ ఐఓసీల్ చేపట్టిన ఆయిల్ అమ్మకంలో భాగంగా 900 ఎంఎల్ ఆయిల్ కొనుగోలుకు 900 ఎంఎల్ పెట్రోల్ ఫ్రీ.. డీజిల్ వాహనాల ఆయిల్ కొనుగోలుపై అదేవిధంగా డీజిల్ ఫ్రీ.. కార్యక్రమాన్ని గురువారం దేవునిపల్లి పెట్రోల్ పంపు వద్ద చేపట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని రైతులు, వినియోగదారులు వినియోగించుకోవాలని చిన్న కలువల సింగల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు, కంపెనీ నుండి విచ్చేసిన సేల్స్ మెన్ రాజేశ్వరరావులు తెలిపారు. గురువారం ప్రారంభమైన ఈ కార్యక్రమం శుక్రవారంతో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి వల్లకొండ రమేష్, సిబ్బంది రైతు సోదరులు, వినియోగదారులు పాల్గొన్నారు.