calender_icon.png 20 November, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి బాధ్యత భవిష్యత్తుని పరిచయం చేసేది గురువే: కార్పొరేటర్ శాంతి

20-11-2025 05:40:56 PM

ఉప్పల్ (విజయక్రాంతి): బడి బాధ్యత విద్యార్థులకు భవిష్యత్తును పరిచయం చేసేది ఉపాధ్యాయులేనని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ అన్నారు. వెస్లీ స్కూల్లోని టీచర్ల కొరత ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రెండు సంవత్సరాలుగా ఓ ప్రైవేట్  ఉపాధ్యాయురాలు అరుణను  నియమించి ప్రతినెల  జీతం అందిస్తున్నారు. గురువారం రోజున నాచారం కార్పొరేటర్ శాంతి ఎమ్మెల్యే తరపున అధ్యాపకురాలకి జీతాన్ని అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ  విద్యార్థి జీవితాన్ని సరైన దారిలో పెట్టేది గురువు అని అన్నారు. ఏది మంచో ఏది చెడు పిల్లలకు తెలిపేది తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఒక టీచర్ మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ నాచారం నాయకులు విట్టల్ యాదవ్ వెస్లీ స్కూల్  ఉపాధ్యాయులు పాల్గొన్నారు