యూరియా యాప్ రద్దు చేయాలని రైతుల ధర్నా
22-06-2026 12:00 AM
కామారెడ్డి, జూన్ 21 (విజయక్రాంతి): యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామస్తులు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం రైతులకు పాస్ పుస్తకాలపై యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
యూరియా యాప్ వల్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని, యూరియా అందడం లేదని రైతుల పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ ను రద్దుచేట్లు పాసుపుస్తకాలపై యూరియా పంపిణీ చేయాలని రైతుల డిమాండ్ చేశారు. పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు.






