25-10-2025 06:51:15 PM
* తడిసిన ధాన్యం పై ఆంక్షలు పెట్టొద్దు
* రైతులందరికీ పరదలు అందజేయాలి
* బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ప్రెస్ మీట్
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పట్టణ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు,ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ప్రతి రోజు వర్షాలు కురవడం ద్వారా ధాన్యము తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుచేత ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలని కోరారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పరదాలు (తార్పాల్) అందించాలని పేర్కొన్నారు. కొన్ని కేంద్రాల్లో పరదలు ఇవ్వాలని రైతులు అడిగితే లేవని సమాధానం చెప్పినట్లు ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.వారికి సరిపడా పరదలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గతంలో హామీలు ఇచ్చిన విధంగా వడ్లకు బోనస్ ఇచ్చి గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేశారు.