18-11-2025 12:00:00 AM
మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మాగనూరు నవంబర్ 17. మాగనూరు మండలం వడ్వా టు శివారులో ఉన్న బసవేశ్వర పత్తి మిల్లు యాజమాన్యం కొనుగోలు కేంద్రం నిలిపివేయడంతో రైతులు ఆగ్రహంతో 167వ జాతీయ రహదారి వడ్వా టు గేటు వద్ద ట్రాక్టర్ తో రోడ్డుపై అడ్డముగా పెట్టి రైతులు సోమవారం సాయంత్రంరాస్తారోకో నిర్వహించారు. రైతులు చేస్తున్న రాస్తారోకో కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని మద్దతు తెలుపుతూ మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతులంటే చులకనాగా చూస్తున్నారని వారు మండిపడ్డారు.
పత్తి మిల్లు యజమానులు సీసీఐ అధికారులు రైతులకు ఎలాంటి సమాచారము ఇవ్వకుండా పత్తి కొనుగోలు నిలిపివేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గత రెండు రోజులు క్రితం స్లాట్ బుక్కు తీసుకుని సోమవారం పత్తి అమ్మడానికి స్లాట్ బుక్ చేసుకున్న రైతులు కొనుగోలు కేంద్రం వద్దకు పత్తి లోడుతో వాహనాల ద్వారా తీసుకొని వస్తే మిల్లు యజమానులు పత్తి కొనుగోలు చేయము సమ్మె ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసం ఉన్నారు .
రైతులను ఇబ్బంది పెట్టడం తో రైతుల అగ్రహం వ్యక్తం చేశారు .మిల్లర్లు ప్రతిరోజు తేమ పేరిట పత్తి కొనుగోలు చేయకుండా నిరాకరించడం కాకుండా ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్ల కొనుగోలు చేస్తామంటూ కొత్త నిబంధనలు పెట్టి నా సీసీఐ అధికారుల వల్ల రైతులు పత్తిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మి క్వింటాలుకు 1500 పైన నష్టపోవాల్సి వస్తుందన్నారు. స్లాట్ బుక్కు చేసుకొని పత్తిని కిరాయి వాహనాల ద్వారా తీసుకుని రావడం రైతులకు భారముగా మారుతుందన్నారు .రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
సంబంధించిన అధికారులు రాస్తారోకో దగ్గర వచ్చి స్లాట్ బుక్ చేసుకున్న రైతుల పత్తిని కొనుగోలు చేసే విధముగా చూస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో, ధర్నాను విరమించారు. మూడు గంటలకు పైగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడం వల్ల. వాహనాలు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి . ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.