calender_icon.png 18 November, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

18-11-2025 12:00:00 AM

  1. కేంద్రమంత్రి, ఎన్‌సీటీఈ చైర్మన్‌కు ఎమ్మెల్సీ, పీఆర్టీయూ నేతల వినతి
  2. నేడు టెట్‌పై నిర్ణయం తీసుకోనున్న కేంద్రం

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత పొందాలనే నిబంధన నుంచి ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్‌లు కోరారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు, జాతీయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) చైర్మన్ పంకజ్ అరోరాకు వారు కలిసి వినతిపత్రం సమ ర్పించి నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు.

దీనిపై ఎన్‌సీటీఈ చైర్మన్ పంకజ్ అరో రా స్పందిస్తూ మంగళవారం కేంద్ర విద్యామంత్రితో జరిగే సమావేశంలో విద్యాహక్కు చట్టాన్ని సవరణ చేయడం లేదా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయి కోర్టులో సరైనా వా దనలు వినిపించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న బీఎడ్ అర్హత కలిగిన సెండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు తర్వలోనే ఇన్ సర్వీస్ షార్ట్ టర్మ్ డిప్లొమా కోర్సును ఎన్‌సీటీఈ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలందరికీ పీఎస్‌హెచ్‌ఎంగా పదోన్నతి పొందడానికి మార్గం సుగమం అవుతుందని పీఆర్టీయూ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.