18-11-2025 07:39:03 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ వెళ్లే దారిలో గల స్థానిక జంగమయ్య శివాలయం వద్ద కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ నిధులతో మంజూరైన బోర్ మోటర్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో వేయించడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపికృష్ణ, చిట్నీని శ్రీనివాస్ రావు మీస శంకర్, మాజీ ఎంపీటీసీ కమిటీకారి పద్మ, బుర్ర శ్రీనివాస్, వరి వెంకటేష్ మరియు ఆలయ చైర్మన్ కొండ యాదగిరి,వైస్ చైర్మన్ బండి శ్రీనివాస్, అవధూత శేఖర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.