calender_icon.png 18 November, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయంత్రం కాకముందే చలి చంపేస్తుంది

18-11-2025 07:39:17 PM

ఉదయం 9 వరకూ వణుకు

వృద్ధులు, చిన్నారులు, రైతులు–ఉద్యోగులకు తీవ్రమైన ఇబ్బందులు

నకిరేకల్,(విజయక్రాంతి): జిల్లాలో చలి ఒక్కసారిగా పెరిగి జనజీవనాన్ని స్తంభింపజేస్తోంది. సాయంత్రం 5, 6 గంటలకే చలి దడ పుట్టించే స్థాయికి చేరడంతో ప్రజలు బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు. తెల్లవారుజామున నుంచి ఉదయం 9 గంటల వరకు చలి దగ్గని పరిస్థితి.

 వృద్ధులు చలికి గడగడ

వయసైన వారు చలి తీవ్రతను తట్టుకోలేక ఇళ్లకే పరిమితమైపోయారు. చేతులు–కాళ్లు గట్టిపడి నడవడమే కష్టంగా మారింది.

 చిన్నారులు, స్కూల్ పిల్లలకు చలి శిక్షలా

ఉదయమే లేచి స్కూల్‌కు వెళ్లాల్సిన చిన్నారులు చలిని భరించలేక వణుకుతున్నారు. హాస్టళ్లలో తగిన వసతులు లేక విద్యార్థులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. చల్లటి నీళ్లతో స్నానం చేసి స్కూల్ చేరడం పెద్ద కష్టంగా మారింది.

 రైతులు, కూలీల పనులకే బ్రేక్

దట్టమైన పొగమంచుతో పొలాలకు వెళ్లడం ఆలస్యమవుతోంది. చేతులు–కాళ్లు గట్టిపడి పని చేయలేని పరిస్థితి. పంట పనులు మందగించగా, కూలీలు చలికి వణుకుతూ పనులు చేయలేక పూట గడవని పరిస్థితి.

 ఉద్యోగులకు ఉదయాన్నే పరీక్ష

ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు చలి గాలులతో బైక్‌పై ప్రయాణం కష్టతరం అవుతోంది.

 వేడి బట్టల ధరలు రెట్టింపు

మార్కెట్లలో స్వెటర్లు, కూలాలు, దుప్పట్ల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలకు మరొక భారంగా మారాయి.

 పొగమంచు– తేమతో చలి మరింత పెరుగుదల

పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గి రోడ్లపై ప్రమాదం పెరుగుతోంది. తేమ అధికమవడంతో చలి తీవ్రత ఇంకా పెరిగింది.