18-11-2025 12:00:00 AM
నారాయణపేట, క్రైం : సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో, ఎస్పీ వినీత్ ను ఆర్టిఏ మెంబర్ పోషల్ రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు రవాణా భద్రత కార్యక్రమంలో పాల్గొంటూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పై కూడా ఉందని సూచించారు .సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి నెల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ సేఫ్టీ మీటింగ్ కు రావాలని తెలిపారు.
జాతీయ రహదారి 167 రాయచూరు రోడ్డులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి వాటి నివారణకు సంబంధిత అధికారులు నిర్వహించే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలకు హాజరుకావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాలల స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.
ఇకముందు జరిగే రోడ్డు భద్రత కు సంబంధించిన అన్ని కార్యక్రమలలో పోలీసు శాఖ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తారీకు నుండి రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతాయి అని ఆర్టీఏ మెంబర్ పోష ల్ రాజేష్ ఎస్పీకి తెలియజేశారు. స్పందిస్తూ జిల్లాలోని రోడ్డు భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారన్నారు.