18-11-2025 07:37:11 PM
పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన ఎస్సై..
పాపన్నపేట (విజయక్రాంతి): మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మంగళవారం ఆయన మిన్ పూర్, యూసుఫ్ పేట, కొత్తపల్లి గ్రామాల శివార్లలో రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ధాన్యం కుప్పల పక్కన రాళ్లు, కర్రలు పెడుతున్నారని, రాత్రివేళ అవి వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు. ప్రజల ప్రయోజనార్థం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు సహకరించాలని సూచించారు. పలువురికి నోటీసీలు జారీ చేశారు. ఏఎస్సై దేవీదాస్, పోలీసు కానిస్టేబుళ్లు ప్రవీణ్, తదితరులున్నారు.