18-11-2025 07:31:08 PM
మేడిపల్లి (విజయక్రాంతి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిపల్లి గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్యప్రసాద్ గత 7 సంవత్సరాలుగా వివిధ రకాలుగా పాఠశాల అభివృద్ధికి నిరంతరం చేస్తున్న కృషిని గుర్తించి, రాష్ట్ర పాఠశాల డైరెక్టర్ నవీన్ నికోలస్ తన కార్యాలయానికి పిలిపించుకొని ఘనంగా సత్కరించి, ప్రశంస పత్రాన్ని అందజేశారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సత్యప్రసాద్ ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల డైరెక్టరే స్వయంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, సత్కరించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, ఇది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా, మరింత బాధ్యతతో పనిచేయడానికి దోహదపడుతుందని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, హర్షం వ్యక్తం చేశారు.