calender_icon.png 18 November, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చర్యలు

18-11-2025 07:41:35 PM

కుంటాల (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలలో అక్రమాలకు పాల్పడవద్దని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు తీరును పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గల వసతులను చూశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని తెలిపారు.

ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేస్తూ, సంబంధిత రిజిస్టర్లు అన్నింటినీ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మన్మద్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అధికారులకు పలు కూలీలకు సూచనలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు.