calender_icon.png 18 November, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిమ వైద్య కళాశాలలో నషా ముక్త్ కార్యక్రమం

18-11-2025 07:32:55 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమము ప్రారంభమై 5 ఏడాది పూర్తయిన సందర్బంగా మంగళవారం నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో 1000 మందితో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా అధికారులు, కళాశాల యాజమాన్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలు మానవ సంబంధాలను ఆరోగ్యాలను నాశనం చేస్తున్నాయన్నారు. విద్యార్థులు వాటికీ దూరంగా ఉండాలన్నారు ప్రతిమ వైద్య కళశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.