టెస్లా కంటే వేగంగా చార్జింగ్
బీజింగ్ (చైనా), ఆగస్టు 14: అద్భుత ఆవిష్కరణల్లో చైనా ఎప్పు డూ ముందుంటుంది. తాజాగా ప్రప ంచంలో అత్యంత వేగంగా రీచార్జి అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన జీక్ సంస్థ రూపొందించింది. ఎలక్ట్రిక్ కార్ రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా కంటే తమ బ్యాటరీలు వేగంగా చార్జ్ అవుతాయని ఆ సంస్థ ప్రకటించింది. తమ బ్యాటరీలు కేవలం పదిన్నర నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతాయ ని వెల్లడించింది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ అదే పనితనాన్ని చూపిస్తాయని పేర్కొంది. టెస్లా మోడల్ 3లో వాడే బ్యాటరీలకు 15 నిమిషాల సమయం పడుతుంది.
280 కి.మీ. రేంజ్ ఇస్తాయి. ఇక జీక్ 007 సెడాన్ వచ్చేవారం అందుబాటులోకి రానుంది. దీనిలో నూతన బ్యాటరీని అమర్చారు. టెస్లాకు మించి జీక్ గొప్పగా నిలిచే అవకాశముందని సినో ఆటో డైరెక్టర్ టూలీ పేర్కొన్నారు. చైనాలో దిగ్గజంగా పేరొందిన గీలీకి చెందిన సంస్థే జీక్ ఇంటెలిజెంట్ హోల్డింగ్ లిమిటెడ్. యూకేకు చెందిన లోటస్, స్వీడన్ వోల్వో ఈ గ్రూపులోని సంస్థలు కావడం విశేషం. ఇకపోతే చైనాలో జీక్‌క్రు చెందిన 500 అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2026 నాటికి ఈ స్టేషన్ల సంఖ్యను 10వేలకు పెంచాలని భావిస్తోంది.




