బంగ్లాలో హిందూ బ్యాట్‌మాన్లు
- మైనారిటీలపై దాడులను ఆపేందుకు రాత్రిళ్లు కాపలా
- తమ వారికి రక్షణగా రాడ్లు, హాకీ స్టిక్కులు పట్టుకుని పహారా
- బంగ్లాలో విధ్వంసం కరాళనృత్యం చేస్తోందన్న హసీనా
- ఆర్థిక సంక్షోభానికి చేరువలో పొరుగుదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 14: బ్యాట్‌మాన్ సినిమా చూసిన వారికి గౌతమ్ సిటీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అక్కడ ఎంత అభివృద్ధి జరిగినా అరాచక శక్తులు రాజ్యమేలుతుంటాయి. సామాన్య ప్రజానీకం మీద దాడులు చేస్తుంటాయి. వారిని కాపాడేందుకు బ్యాట్‌మాన్ రంగంలోకి దిగుతాడు. అయితే ప్రస్తు తం బంగ్లాదేశ్ మొత్తం గోతమ్ సిటీని తలపిస్తోంది. కానీ, అక్కడ కాపాడేవారు కనిపించ డం లేదు. ప్రస్తుతం ఏర్పడిన తాత్కాలిక ప్రభు త్వం ఎన్ని సూచనలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక రాజధాని ఢాకా విష యానికి వస్తే పోలీసు అధికారులు సైతం కం టికి కనిపించడం లేదు. దీంతో తమ కుటుంబాల ప్రాణాలు రక్షించుకోవడానికి యువతే బ్యాట్‌మాన్లుగా మారారు. వాళ్లు కర్రలు, రాడ్లు, హాకీ స్టిక్కులతో రాత్రిళ్లు వీధుల్లో కాప లా కాస్తున్నారు. ఢాకాలోని హిందూ కాలనీ ల్లో ఈ రకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
బందీపోట్లకు అవకాశం
బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందు వులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లైంగికదాడులు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని కాలనీల్లో అప్రమత్తమైన యువత తమ కుటుంబాల రక్షణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హసీనా రాజీనామా చేసినప్పటినుంచి 200 మందికిపైగా హిందూ కుటుంబాలు, వారి వ్యాపారాలపై దాడులు జరిగాయి. ప్రస్తుతం తమ కుటుంబాలకు రక్షణగా కాపలా కాస్తున్న యువత.. అనేక మందిని పోలీసులకు పట్టించారు. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకు ని దొంగలు, బందీపోట్లు సైతం అమాయక ప్రజలను దోచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక సంక్షోభంలో బంగ్లా
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ్ల ఆర్థిక పరిస్థితులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. బంగ్లాదేశ్ గణాంకాల బ్యూరో నివేదిక ప్రకారం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. డాటా ప్రకారం జూలైలో ద్రవ్యోల్బ ణం 11.6 శాతానికి ఎకబాకి 12 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని చెబుతోంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం 14 శాతానికి చేరిందని, ఇది 13 ఏళ్ల గరిష్ఠ స్థాయి కంటే అధికమని పేర్కొంది. తీవ్రమైన నిరసనల నేపథ్యంలో బంగ్లా వ్యాప్తంగా సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.
అంతేకాకుండా వ్యాపార వ్యవస్థలతో పాటు సెంట్రల్ బ్యాంక్ సైతం ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో గరిష్ఠ నగదు ఉపసం హరణ పరిమితిని సెంట్రల్ బ్యాంకు గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం బంగ్లా ప్రభుత్వా న్ని నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్ నడిపిస్తున్నా ఆర్థిక వ్యవస్థ గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిరసనలతో విధ్వంసం
రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా మొదటిసారి స్పందించారు. దేశంలో పరిస్థితులను గమనిస్తు న్నానని, నిరసనల పేరుతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆమె కొడుకు సాజీద్ వాజెద్ ఎక్స్ ఖాతా వేదికగా ఆమె 3 పేజీల వివరణను పోస్ట్ చేశారు. 1975 ఆగస్టు 15లో తన తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ హత్య తర్వాత ఆ స్థాయి విధ్వంసం ఇప్పుడే చూస్తున్నానని చెప్పారు. ఇలాంటి విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని, ముఖ్యంగా బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన తన తండ్రి విగ్రహాలను కూల్చినవారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు.




