15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తిమ్మన్నపల్లి వద్ద ఘోర ప్రమాదం

15-02-2026 12:00 AM
  1. ముగ్గురు వ్యక్తుల దుర్మరణం
  2. నాగర్ కర్నూల్ జిల్లా జడ్చర్ల-కోదాడ హైవేపై ఘటన 

కల్వకుర్తి, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద తుఫాన్ వాహనం కల్వర్ట్‌కు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నుంచి తుఫాన్ వాహనంలో శ్రీశైల దేవస్థానానికి వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో రమణ గౌడ్ (52 )మేఘ దాసి (46 )మాధవి (60 )ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పలువురిని వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పంచనామ నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.