calender_icon.png 11 May, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్రి మానుపై మమకారం

11-05-2025 01:14:02 AM

  1. వానకు కూలిన 2౦౦ ఏండ్ల చెట్టు 
  2. అదే స్థానంలో రీప్లాంటేషన్
  3. ఆదర్శం బయ్యారం గ్రామస్థులు

మహబూబాబాద్, మే ౧౦ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామంలో ౨౦౦ఏళ్ల  వయసు ఉన్న మర్రి మానుపై ఆ గ్రామస్థులకు ఎనలేని మమకా రం. చల్లని నీడని ఇవ్వడంతో పాటు గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయం చెంతనే ఉండటంతో చెట్టుపై కూడా భక్తిభావం పెంపొం దింది. అయితే ఈ నెల ఒకటిన అర్ధరాత్రి వీచిన పెనుగాలులకు ఆ మర్రిమాను కూకటి వేళ్లతో కూలిపోయింది. దీంతో గ్రామస్థులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మర్రిమానును తిరిగి నిలబె ట్టాలని తలపోసారు.

గ్రామ పెద్ద, రిటైర్డ్ టీచ ర్ గుండా మధుకర్‌రెడ్డి సారధ్యంలో మర్రిమానును తిరిగి నిలబెట్టేందుకు ముత్యాలమ్మ తల్లి దేవాలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్థులు సమిష్టి కృషిగా నిర్ణయించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించి వారి సూచన మేరకు మర్రిమానును తిరిగి నిలబెట్టడానికి చర్యలు చేపట్టారు. కొమ్మలను కత్తిరించి, భారీ క్రేను, రెండు జేసీబీల సహాయంతో కూలిన చోటే శనివారం మర్రిమానును నిలబెట్టారు. దీనంతటికీ వారం సమయం పట్టింది. మర్రిమాను పునర్జీవం పోసుకుంటుందనే ఆశాభావంతో గ్రామస్థులు ఉన్నారు.