29-09-2025 08:04:08 PM
చిట్యాల (విజయక్రాంతి): తన కుమార్తె అదృశ్యమైందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని సోమవారం చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. చిట్యాల మండలం వేంబావి గ్రామానికి చెందిన పంగారెక్క కృష్ణయ్య(56) అనే వ్యక్తి తన కుమార్తె పంగారెక్క ఆదిత్య కుమారి(19) అదృశ్యమైందని చిట్యాల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కుమారి నల్గొండలోని ఆల్ఫా కాలేజీలో నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతూ, హాస్టల్ లో ఉంటోందని, దసరా సెలవుల కారణంగా సెప్టెంబర్ 26న స్వగ్రామానికి వచ్చిన ఆమె, సెప్టెంబర్ 28 ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని, బంధువుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బోడంగిపర్తి, నల్గొండ జిల్లాకు చెందిన అస్కా శంకరయ్యపై అనుమానం వ్యక్తం చేశారని, తన కుమార్తె ఆచూకీ కనుగొని తమకు అప్పగించవలసిందిగా చిట్యాల పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తండ్రి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని చిట్యాల ఎస్ఐ తెలిపారు.