29-09-2025 08:01:27 PM
మందమర్రి (విజయక్రాంతి): ఇటీవల జనగామలో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పట్టణంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కాలేజ్ విద్యార్థి పి.మణిదీప్ అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా డీఐఈఓ కే అంజయ్య తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని సోమవారం ఆయన అభినందించి మాట్లాడారు పట్టణంలోని మోడల్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మణిదీప్ ఫుట్‌బాల్ పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారన్నారు. అక్టోబర్ 2 నుండి 12వ తేదీ వరకు శ్రీనగర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు, కాలేజీకి పేరు తీసుకురావాలని కోరారు. కాగా రాష్ట్ర స్థాయి జట్టుకు కోచ్ గా గాలిపెళ్లి సురేందర్ వ్యవహరించనున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మణిదీప్ ను ఒలింపిక్ అసోసియేషన్, ఫుట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి బాబురావులు అభినందించారు.