20 April, 2026 | 7:22 AM

కులగణనతో బీజేపీలో భయం

29-04-2024 12:18 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): బడుగు బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆరోపించారు. కేంద్రంలో ఇండి యా కూటమి అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ చెబు తుంటే.. బీజేపీ జీర్ణించుకోవడం లేదన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం మాట్లా డుతూ.. ఇండియా కూటమి అధికారంలో కి వస్తే ఏడాదికో ప్రధాన మంత్రి మారుతారని మోదీ చెప్పడం సరికాదన్నారు. ఇండియా కూటమికి 50 సీట్లు రావని చెబుతూ మళ్లీ ప్రధాని గురించి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో ఆయోధ్యలో రాముడి గుడి కట్టడం తప్పా.. దేశానికి ఏమీ చేయలేదన్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు చేస్తామనడం సరికాదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ మళ్లీ వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తాడని వీహెచ్ పేర్కొన్నారు. మోదీ ఆలోచన అంతా కార్పొరేట్లకు లాభం చేకూర్చడంపైనే ఉంటుందన్నారు.