ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు
ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో..
కొత్తగూడెం ఆగస్టు 6, విజయక్రాంతి: కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ హాజరైనారు. చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ కొత్తపల్లి జయశంకర్, తెలంగాణ ప్రజల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని,
తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్ర అత్యంత కీలకమని,తన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భావితరాలకు స్ఫూర్తిదాయకులని పేర్కొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా సమాజంపై చెరగని ముద్ర వేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిఎం ,ఎస్వోటు జిఎం గోవిందరావు, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఏఐటియూసి బ్రాంచ్ ఆఫీస్ బేరర్,సందేబోయిన శ్రీనివాస్ , ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏజీఎం (సివిల్) సి.హెచ్. రామకృష్ణ, ఎజిఎం(ఫైనాన్స్) బిబత్స, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్.తిరుపతి, డివైపిఎం హరీష్ , సీనియర్ పీఓ మురళి , ఐఎన్టియూసి ఫిట్ సెక్రటరీ సిహెచ్. సాగర్, ఏఐటిఎయూసి ఫిట్ సెక్రటరీ కే.సౌజన్య, ఇతర విభాగ ఆధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.






