calender_icon.png 11 February, 2026 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటులో ఫీజులను నియంత్రించాలి

11-02-2026 03:23:41 AM

సీఎంకు ంపీ ఆర్ కృష్ణయ్య లేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కార్పొరేటు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు, డొనేషన్ల పేరుమీద లక్షల రూపాయలు వసూలు చేస్తూ, ప్రజలను దోపిడీ చేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజులను నియంత్రించాలని గతంలో 10 సంవత్సరాల క్రితం అధికారులతో కమిటీ వేశారని కానీ రిపోర్ట్ లేదన్నారు. ఫీజులకు గరిష్ట పరిమితి విధించుటకు జీవో జారి చేయాలని, అసెంబ్లీలో ఫీజుల నియంత్రణ చట్టం ప్రవేశపెట్టాలని, ఫీజుల నియంత్రణకు ఒక కమిటీ వేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు.