calender_icon.png 11 February, 2026 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి యాజమాన్యానికి వినతి

11-02-2026 03:22:53 AM

రాష్ట్ర జలమండలి ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి

ముషీరాబాద్, ఫిబ్రవరి10 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాట ర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్‌ఏండబ్ల్యూఎస్ &ఎస్.బి)లో పనిచేస్తున్న ఉద్యోగుల  సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జలమండలి ఉద్యోగుల యూనియన్ (టిజెఈ యు) యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ జలమండలి ఉద్యోగుల యూనియన్ (ఐఎన్‌టియుసి) ప్రతినిధి బృందం మంగళవారం హెచ్‌ఏండబ్ల్యూఎస్ అండ్ ఎస్.బి మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్ రెడ్డికి ఒక విజ్ఞాపన పత్రాన్ని మంగళవారం సమర్పించింది.

ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం దృష్ట్యా తక్షణ చర్యలు అవసరమని యూనియన్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ అధ్యక్షులు అల్లి శ్రావణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లు ఏం. రాజా, కె. ఆనంద్ రెడ్డి, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె. రాజిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు ఎండి. జహంగీర్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ వైస్ చైర్మన్ శంకర్ ప్రకాష్, మేవ నేత అక్తర్ అలీ, సి.రాజు, జి. కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు.

సమ్మెను జయప్రదం చేయండి

 కేంద్రం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న జాతీయ సార్వత్రిక సమ్మెను జలమండలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపా ధ్యక్షులు, జలమండలి ఉ ద్యోగుల యూనియన్  అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి పిలుపు నిచ్చారు. బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపా ర్క్ భారీ ర్యాలీలో జలమండలి ఉద్యోగులు, ఐ.ఎన్.టి.యు.సి  పాల్గొనాలని కోరారు.