calender_icon.png 19 December, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సర్పంచులకు సన్మానం

19-12-2025 01:10:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్18( విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచులు గెలుపొందటంతో వారిని గురువారం బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ తన నివాసంలో గెలుపొందిన బూరుగూడ సర్పంచ్ మేకర్తి సంగీత లక్ష్మణ్, చిర్రకుంట సర్పంచ్ పార్వతి, కోసార సర్పంచ్ గీతాంజలి, మానిక్ గూడ సర్పంచ్ రాము,వార్డు సభ్యులను పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనగా గెలుపొందిన సర్పంచులు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యూత్ అధ్యక్షుడు గాజుల రాజేంద్రప్రసాద్, నాయకులు మేకర్తి ప్రశాంత్, సురే ష్, కరణ్ తదితరులు పాల్గొన్నారు.