calender_icon.png 7 September, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా మావోయిస్ట్ ఎన్‌కౌంటర్

07-09-2025 12:41:08 AM

ఛత్తీస్‌గఢ్‌లోని రాయణపూర్- దంతెవాడ జిల్లాల మధ్య ఘటన

చర్ల, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): చర్ల సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని నారాయణ పూర్-- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మవోయిస్టు మృతి చెందింది. ఈ ప్రాంతంలో మావోయి స్టులు ఉన్నారనే సమాచారంలో రెండు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త బృం దం ఆపరేషన్ చేపట్టింది.

ఈ ఆపరేషన్ జరుగుతండగా బలగాలకు, మవోయిస్టుల కు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ కాల్పులో ఓ మహిళా మావో యిస్టు మృతి చెందగా,మరి కొందరు మావో యిస్టులు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక 303 రైఫిల్, 2 బీజీఎల్స్ లాంచర్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యను ముమ్మరం చేశారు. కాగా ఎన్‌కౌంట ర్‌లో మృతి చెందిన మహిళా మావోయిస్టు  సోధి విమ్లాగా గుర్తించారు. ప్లాటూన్ నంబర్ 16 కమాండర్, పీపీసీ కార్యదర్శి అని, ఆమెపై రూ. 8 లక్షల రివార్డు ఉందని పోలీ సులు తెలిపారు.