calender_icon.png 7 September, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముగిసిన రుద్రారం సిద్ధి గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు

07-09-2025 12:42:38 AM

పటాన్ చెరు,(విజయక్రాంతి): ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గల ప్రసిద్ధ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.