23-04-2025 12:40:07 AM
- ఆక్రమణకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు
- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు ప్రయత్నించినా, ఆక్రమించినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఏసీబీ కార్యాలయం ఎదుట గల రూ.1,200 కోట్ల విలువగల 12 ఎకరాల ప్రభుత్వ స్థల రక్షణకు డీజీపీఎస్ సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శనివారంలోగా రూ.35 లక్షలతో జిఐ షీట్స్, ఐరన్ పోల్స్ చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు. ఆ స్థలం ప్రభుత్వాని దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, షేక్‌పేట తహసీల్దార్ అనితరెడ్డి, డీఈ సంజీవ్, ఏఈ శ్రీధర్ ఉన్నారు.