calender_icon.png 14 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల తరఫున పోరాడండి

14-12-2025 12:15:57 AM

  1. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు లేవనెత్తండి 
  2. రిజర్వేషన్లపై విధించిన 50 పరిమితిని ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలి
  3. యూపీ మాజీ సీఎం అఖిలేష్‌కు బీసీ సంఘాల వినతి

హైదరాబాద్, డిసెంబర్13( విజయక్రాంతి) :  దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజ ర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ సమా జ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ చేసిన చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించేలా సమాజాద్ పార్టీ తరఫున పోరాడాలని విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ పర్యటనకు విచ్చేసిన అఖిలేష్ యాదవ్‌ను శనివారం హై దరాబాదులో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ పెరిక సురేష్, కనకల శ్యాం కురుమ, శేఖర్ సగరలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు.  ముందు గా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచడం లేదన్నారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెం బ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదని ఆయనకు గుర్తుచేశారు.  బీసీ రిజర్వేషన్లు పెంచకుండా దేశంలో 50 శాతం పరిమితిని విధించడం చాలా అన్యాయమన్నారు. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే 50శాతం పరిమితిని ఎత్తివేసేలా సమాజ్ వాదీ పార్టీ తరఫున కేంద్రంపై పోరాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రిజర్వేషన్ల పెంపు కోసం దేశవ్యాప్తంగా జరుగు తున్న బీసీ ఉద్యమానికి సమాజ్ వాదీ పార్టీ తరఫున మద్దతు ఇవ్వాలని కోరారు.  బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ తరఫున పార్లమెంట్‌లో మాట్లాడుతామని, దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమానికి సమాజ్ వాదీ పార్టీ కూడా భాగస్వా మ్యం అవుతుందని అఖిలేష్ యాదవ్ బీసీ నేతలకు హామీ ఇచ్చారు. సమావేశంలో బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్, వేముల రామకృష్ణ, గూడూరు భాస్కర్, వెంకటేష్ గౌడ్, పాల్గొన్నారు.