22-06-2024 12:35:17 AM
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న ఈ సినిమాను సాహిత్ మోత్కూరి తెరకెక్కిస్తున్నారు. నిసా ఎంటర్ టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యాన ర్లపై నిషాంక్ రెడ్డి కుడితి, సురేశ్ కుమార్ సడిగె నిర్మిస్తున్నారు. త్వరలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల ముందుకు వచ్చాయి. తాజాగా శుక్రవారం ‘బుజ్జిమేక’ పాటను సైతం చిత్ర నిర్మాణ కర్తలు విడుదల చేశారు.
ఈ చిత్రం నుంచి నాలుగో పాటగా వచ్చిన స్ఫూర్తి గీతమిది. చదువు విలువను తెలియజేస్తున్న ఈ పాటలోని ప్రతి పాదం, ప్రతి పదం ఆలోచింపజేసేలా ఉంది. ‘బుజ్జి మేక మంద ముందు నడిచే.. బుల్లి గువ్వ రెక్క తొడిగి ఎగిరే.. సిట్టి చిలక పలుకులు నేర్చే కోలో కోలో.. సీకటిగున్న తోవల్లోన ఎలుగులు నింప ఏలో ఏలో...’ అంటూ సాగుతున్న ఈ పాట సాహిత్యాభిమానులను ఆకట్టుకుం టోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కాలభైరవ ఆలపించగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.