calender_icon.png 7 November, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే తరాలకు మీరెంతో స్ఫూర్తి

07-11-2025 12:00:00 AM

వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసింది. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మహిళా క్రికెటర్లను ప్రశంసలతో ముంచెత్తారు.కఠిన సవాళ్లను ఎదుర్కొని వారు సాధించిన విషయం అసాధారణమైనదని కితాబిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఈ విజయం ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భారత మహిళల జట్టంతా సంతకాలు చేసిన ప్రత్యేక జెర్సీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందజేసింది.