ఆడబిడ్డకు ఆర్థిక సాయం
చేవెళ్ల మున్సిపల్ కౌన్సిలర్ మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి
చేవెళ్ళ ఏప్రిల్ 28(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులో ఆడపడుచు పెళ్లికి రూ. 25వేలు ఆర్థిక సాయం అందిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకుమంగళవారం ఆమె ఆర్థిక సాయం అందించారు. చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి 15 వార్డు నివాసి గుడిసె రాములు కూతురు వివాహానికి పెళ్లి కానుకగా రూ. 25 వేలు రాములు నివాసంలో అందజేశారు. మా వార్డు ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహకారం అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. హామీ నెరవేర్చడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, నాయకులు అత్తెల్లి రమణారెడ్డి, నరేందర్ రెడ్డి, గుత్తి శేఖర్, బీర్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.






