calender_icon.png 24 August, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూళ్లలో కొత్తగా కెప్టెన్సీ విధానం

24-08-2025 01:46:36 AM

విద్యాశాఖ వినూత్న కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చేపట్టబోతోంది. పాఠశాలల్లో నిర్వహించే పలు కార్యక్ర మాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు క్యాప్టెన్సీ విధానాన్ని తీసుకొస్తోంది. స్కూల్  కెప్టెన్, గ్రూప్ కెప్టెన్లు నలుగుగు, స్పోర్ట్స్ కెప్టెన్లను నియమించనున్నారు.

పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు అంటే ఆగస్టు 15, జనవరి 26, స్పోర్ట్స్, పాఠశాలలకు ఎవరైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు, ఇతర కార్యక్రమాలను నిర్వహించినప్పుడు కెప్టెన్లే స్కూల్ గురించి మొత్తం వివరిస్తారు. తద్వారా వారిలో నాయ కత్వ లక్షణాలు మెరుగుపడటమే కాకుండా పాఠశాలలకు అంబాసిడర్లుగా, తోటి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేవారుగా నిలుస్తారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు.