04-05-2025 08:57:44 PM
భద్రాచలం (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి సర్దార్ జలగం వెంగళరావు జయంతి సందర్భంగా ఆదివారం భద్రాచలం చెందిన పట్టణ ప్రముఖులు సారపాకలోని వెంగళరావు విగ్రహానికి పూలమాలలతో జయంతి వేడుకలు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందంటే అది సర్దార్ వెంగళరావు కృషి వలనే సాధ్యమైందని ఉన్నారు. సార్ పాకలోని బిపిఎల్ గాని పాల్వంచలోని వివిధ ఫ్యాక్టరీలు ఆయన హయాంలోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సీనియర్ న్యాయవాది పీవీ రమణ రావు, న్యాయవాదులు రామంస, అక్తర్, రాము తదితరులు పాల్గొన్నారు.