04-05-2025 09:14:14 PM
మందమర్రి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు నమోదు కార్యక్రమాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి రైతుకు 11 నంబర్లు గల విశిష్ట గుర్తింపు కార్డులు ఇచ్చుటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విశిష్ట గుర్తింపుకార్డులు మండలంలోని ప్రతి రైతుకు అందించుటకు నమోదు కార్యక్రమం ఈ నెల 5 నుండి మండలంలోని బొక్కలగుట్ట గ్రామ పంచాయతి కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పట్టాదారు పాస్ పుస్తకంలతో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి గుర్తింపు కార్డులు పొందాలని ఆయన కోరారు.