04-05-2025 09:52:27 PM
మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగింది. నీట్ పరీక్షకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజీవ్ నగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,204 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 1,166 మంది అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం పూర్తి బందోబస్తు మధ్య తరలించినట్లు తెలిపారు.