04-05-2025 09:30:25 PM
రాజీవ్ రహదారి వెంట చెట్లు నేలకొరిగాయి..
పలు గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం..
కొండపాక: కొండపాక మండలంలో ఆదివారం సాయంత్రం గాలి వాన బీభత్సవం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా గాలివాన దుమారం లేచి భారీ వర్షం కురిసింది. అలాగే మండలంలోని మర్పడగ, సిర్సనగండ్ల, దమ్మకపల్లి, కొండపాక దుద్దెడ, బందారం గ్రామాల్లో వడగండ్లతో కూడిన వాన కురిసింది. ఇదురుగాలులకు రోడ్డు వెంట ఉన్న చెట్లు నేలకులాయి, అలాగే విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి. దాంతో పలు గ్రామాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. మర్పడగ సిరసనగండ్ల బందారం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలాయి. బందారం గ్రామంలో బాలవికాస్ నీటి శుద్ధికరణ గది పూర్తిగా ధ్వంసం అయింది. రేకులు లేచిపోయాయి. రాజీవ్ రహదారి వెంట చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పల నుంచి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది.