12 May, 2026 | 6:25 PM

తృతిలో తప్పిన అగ్నిప్రమాదం

12-05-2026 05:51 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌటా(భి )గ్రామంలో. మధ్యాహ్నం పూట గ్రామం సమీపంలోని బస్టాండ్ రోడ్డు పక్కన ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటలు గ్రామం వైపు నివాస గృహాల వైపు వెళుతుండడంతో స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. ఉవ్వెత్తున లేచిన మంటలను చూసి సమీప కాలనీ వారు మంటలను చల్లార్చడం  జరిగింది. మధ్యాహ్నం పూట జరిగిన ఈ సంఘటనతో కాలనీవాసులు వణికిపోయారు. వెంటనే సమాచారాన్ని 100 డైల్ కు చరవేయడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు